Wednesday, September 3, 2014

                                                  రాజధాని ప్రకటన

                                    ముందుగా  ఊహిమ్చిన ప్రకారం  రాజధాని ప్రకటన నిర్ణయం,  రెండవ తేది మంగళవారం  అష్టమి తిది  నుండి,  నాలుగవ  తేది  గురువారం నాటికి వాయిదా వేయడం  చాల మంచి నిర్ణయమే..  నేడు మంగళవారం వారాధిపతి కుజుడు స్పోటకకారకుడు, యుద్ధకారకుడు.తిధి అష్టమి. అష్టమినాడు చేసినపనులు, తీసుకున్న నిర్ణయాలు  కష్టము కలిగించవచ్చును.  ఈ స్తితిని బట్టి  నిర్ణయం  వాయిదావేసి ఉండవచ్చును . గురువారం నాలువ తేదీ తిది దశమి.  వారాధిపతి గురువు  నక్షత్రమ్ మూల.  ఇవి అన్నవిధములుగా యోగాకరమైనవి.  అందునా  ఆ రోజున  మద్యాహ్నం  2 గంటల తరువాత  మూడుగంటల లోపల నిర్ణయం ప్రకటించుట శుభకరము..  పుర్వాషాడ నక్షిత్రమున ధనుర్లగ్నమున, చేయుట మరీ ఉత్తమము. లగ్నాధిపతి గురువు కర్కాటకమున ఉచ్చస్తితి పొందియున్న కారణమున విశేష శుభఫలములు కలుగును.  అందుచే ఈ నిర్ణయము గురువారము నాటికి వాయిదా వేసి ఉండవచ్చునని నేను భావించు చున్నాను.

                                                                                        గుమ్మా రామలింగ స్వామి
                                                                                           భవానీ జ్యోతిష్యాలయం 

No comments:

Post a Comment